మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి. ఇంకా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఉండవు. ఆర్థికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు వెంటాడుతాయి. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి వెళుతుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా శివ అష్టోత్తరం చదవండి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార పరంగా మాత్రం లాభాలు బాగుంటాయి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. సమాజ సేవలో పాల్గొంటారు. శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కి గాని ప్రమోషన్స్ కానీ లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్.
మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సినీ పరిశ్రమంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. హనుమాన్ వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్.
కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. మీకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. లేదు దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ.
సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాములతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి లాభాలు బాగుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పర్సనల్ లోన్లకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థాయిని సాధించగలుగుతారు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాటిని అదుపు చేసే ప్రయత్నం చేయాలి. నూతన వాహన యోగం ఏర్పడుతుంది. స్వగృహ యోగం ఏర్పడుతుంది. విదేశాలు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ప్రతిరోజు కూడా అరటి నారావత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
తులారాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగ పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు పైన శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో కొన్ని అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ.
వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. నరదిష్టి కొంతవరకు తగ్గుతుంది. మీరు చేస్తున్న పనిని గోప్యంగా ఉంచండి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పదిమంది మెప్పు కోసం మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో తర్వాతే కాలంలో అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. పాస్పోర్టు వీసా లభిస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్.
ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మానసీకమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కెరియర్ పరంగా మీరు కోరుకున్న రంగంలో స్థిరత్వం లభిస్తుంది. చాలాకాలంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్ లభిస్తుంది. సినీ కళా రంగాలలో ఉన్నవారికి అంతంతమాత్రంగా ఉంటుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కెరియర్ పరంగా కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవారాధన ఎక్కువగా చేయండి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మాట తీరుతో ఇంట బయట అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టినా పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బందు మిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు రెడ్.
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. సన్నిహితులతో మాత్రమే ముఖ్యమైన విషయాలను చర్చించండి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు. ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేయండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు పెరుగుతాయి. నూతన అరుణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ.
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. నూతన ఉద్యోగాలలో ఎంపిక అవుతారు. మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ప్రతి పనిలో కూడా దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. మీరు సొంతంగా చేస్తే వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చదువుపై శ్రద్ధ వహిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన నూతన కోర్సులను అభ్యసిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలమనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు ప్రారంభించిన వ్యాపారాలలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలిగిపోతాయి. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. వివాహపరంగా స్వంత నిర్ణయాలు పనికిరావు. పెద్దవాళ్ల సలహాలు సూచనలు పాటించండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయన చేయండి. శని గ్రహ స్తోత్రం కూడా చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు.