గౌహతి: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆద్యంత రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఓపెనర్లు మార్క్‌రమ్, రికల్టన్‌ను తమ జట్టుకు శుభారంభం అందించారు. 82 పరుగుల వద్ద ఈ జోడీకి బ్రేక్ పడింది. బుమ్రా మార్క్‌రమ్(38)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంతసమయానికే కుల్దీప్ బౌలింగ్‌లో రికల్టన్(35) పంత్‌కి క్యాచ్ ఇఛ్చి వెనుదిరిగాడు. ఆ స్టబ్స్, బవుమాల జోడీ సఫారీలకు అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 84 పరుగులు జోడించారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత జడేజా ఈ బ్రేక్ వేశాడు. 166 పరుగుల వద్ద బవుమా(41) పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో రికల్టన్(49) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ ముల్డర్‌ని ఔట్ చేశాడు. దీంతో 68 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. క్రీజ్‌లో జోర్జీ (8), ముత్తుస్వామి(౦) ఉన్నారు.