బేగంపేట: విమానయాన సంస్థలో పని చేస్తున్న యువతిపై పైలట్ అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోహిత్ శరణ్(60) అనే వ్యక్తి బేగంపేట విమానాశ్రయంలో పైలట్‌గా పని చేస్తున్నాడు. కంపెనీ పనుల నిమిత్తం ఓ యువతితో కలిసి అతడు బెంగళూరుకు వెళ్లాడు. ఆమె కూడా పైలట్ గా పని చేస్తుంది. హోటల్ గదిలో ఆమెపై అత్యాచారం చేయడానిక ప్రయత్నించగా ఆమె తప్పించుకుంది. అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకుంది. బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు అతడి కేసు నమోదు చేయడంతో కేను బెంగళూరులోని హలసూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.