అమరావతి: కర్నాటక రాష్ట్రం బెంగళూరులో దోపిడీ చేసిన నగదును కుప్పంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ దొంగల ముఠా బెంగళూరులోని ఎటిఎం లాజిస్టిక్ వాహనం నుంచి 7.11 కోట్ల రూపాయలను దోపిడీ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. కర్నాటక పోలీసులు వారిని వెంటాడుతూ కుప్పం చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో కుప్ప మండలం కూర్మానిపల్లి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదు దొరికింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దోపిడీ కేసులో నవీన్ ఒక్కడే లేడని ముఠా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.