అబూజా : నైజీరియాలో ఓ సాయుధుడు 303 మంది స్కూలు పిల్లలను, 12 మంది టీచర్లను అపహరించుకుని , బందీలుగా తీసుకువెళ్లాడు. అక్కడి నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడి క్యాథలిక్ విద్యా సంస్థ సెయింట్ మేరీస్ స్కూల్‌లోకి చొరబడ్డ దుండగుడు తుపాకీతో బెదిరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ముందు రెండు వందల మంది పిల్లలనే అపహరించుకుపోయినట్లు తొలుత ప్రకటించారు. తరువాతి నిర్థారణలో ఈ సంఖ్య పెరిగింది. స్కూళ్లలోకి చొరబడి సాయ/ధ ముఠాలు కిడ్నాప్‌లకు పాల్పడటం నైజీరియాలో ఇటీవలి కాలంలో పెరిగిన నేరసంస్కృతికి అద్దం పడుతోంది. క్రిస్టియన్స్‌పై దాడుల నేపథ్యంలోనే క్యాథలిక్ విద్యాసంస్థలపై ఎక్కువగా మిలిటెంట్ల దాడులు జరుగుతున్నాయి.