హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో నకీలీ ఖాకీ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోవడంతో పోలీస్ పై తనకున్న ఫ్యాషన్ తో ఖాకీ డ్రెస్ కొనుక్కుని డ్యూటీలు చేస్తున్న ఉమాభారతి అనే యువతిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్లలోని షాపూర్ నగర్ కు చెందిన ఉమాభారతి (21) డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. పోలీస్ కావాలనే కోరిక ఎక్కువగా ఉండడంతో పోలీస్ డ్రెస్ కొనుగోలు చేసి వివిధ మీటింగ్ లలో డ్యూటీ చేస్తోంది. గతంలో విఐపి మీటింగ్ లతో పాటు సెక్రటేరియట్, సైబరాబాద్ సిపి ఆఫీస్ లల్లో మీటింగులకు సైతం హాజరయ్యారు. నిన్న సైబరాబాద్ సిపి ఆఫీస్ క్యాంటీన్ లో టిఫిన్ చేస్తుండగ అనుమానం రావడంతో ఉన్నతాధికారులు విచారించారు. మాదాపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు కేసును అప్పగించారు.