గౌహటి: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గౌహటి బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికా ఓపెనర్లు తొలి వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే బుమ్రా.. మార్క్‌రమ్(38) వికెట్ తీయడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత కొంత సమయానికే మరో ఓపెనర్ రికెల్టన్ (35) కూడా ఔట్ అయ్యాడు. అనంతరం స్టబ్స్, బవుమాల జోడీ సఫారీలకు అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 84 పరుగులు జోడించారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత జడేజా ఈ జోడీకి బ్రేక్ వేశాడు.
166 పరుగుల వద్ద కెప్టెన్ టెంబా బవుమా(41) ఔట్ చేశాడు. డు. 166 పరుగుల వద్ద బవుమా(41) పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో రికల్టన్(49) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. అనంతరం కుల్దీప్ ముల్డర్‌ని ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలో డి జోర్జి, ముత్తుస్వామిలు మరో భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, సిరాజ్ బౌలింగ్‌లో జోర్జి(28) ఔట్ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా 81.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో కుల్దీప్ 3, బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ తీశారు.