గౌహతి: సౌతాఫ్రికాతో శనివారం నుంచి జరిగే రెండో, చివరి టెస్టు ఆతిథ్య టీమిండియాకు సవాల్‌గా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు రిష బ్ పంత్ సారథ్యం వహించనున్నాడు. మెడ నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానం లో పంత్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నా డు. తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు ఈ మ్యాచ్ చావోరేవోగా తయారైంది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే రెండో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. గిల్ వంటి కీలక ఆటగాడు దూరమైన నేపథ్యంలో సౌతాఫ్రికా వంటి బలమైన జట్టును ఎదుర్కొవడం భారత్‌కు అంత తేలిక కాదనే చెప్పాలి. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సఫారీ టీమ్ సమతూకంగా ఉంది. తొలి మ్యాచ్‌లో సమష్టిగా పోరాడి భారత్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది.
గెలవాల్సిందే..
మరోవైపు ఆతిథ్య భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాల్సన పరిస్థితి ఏర్పడింది. ఇందులో గెలిస్తేనే సిరీస్‌ను సమం చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే కొంత కాలంగా వరు స విజయాలతో టెస్టు క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న డబ్లూటిసి ఛాంపియన్ సౌతాఫ్రికాను ఓడించడం అంత సులువుకాదనే విష యం భారత్ గుర్తుంచుకోవాలి. బ్యాటింగ్, బౌ లింగ్ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటా యి. లేకుంటే సిరీస్‌ను కోల్పోవడం ఖాయం.