ఎర్రకోట బాంబు పేలుడు కేసు విచారణ దశలో జమ్మూ కశ్మీర్‌లో ఓ ఎలక్ట్రిషియన్‌ను భద్రతా బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. ఈ వ్యక్తికి జైషే మహమ్మద్ ఉగ్రసంస్థతో ఉన్న సంబంధాలపై ఆరాతీస్తున్నారు. ఉగ్ర నెట్‌వర్క్ బాగా విస్తరించుకుని ఉంది. సాంకేతిక నిపుణులు, ఎలక్ట్రిషియన్లు, పలు దశల్లో పనిచేసే వారిని పావులుగా వాడుకుని ఫరీదాబాద్ డాక్టర్ టెర్రర్ నెట్‌వర్క్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇప్పుడు పుల్వామాలో తుఫైల్ అహ్మద్ అనే వ్యక్తిని దర్యాప్తు బృందాలు అక్కడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతం నుంచి అదుపులోకి తీసుకువెళ్లాయి. విచారణకు రంగం సిద్ధం అయింది.