రానున్న ఐపిఎల్ సీజన్ 2026 కోసం ఆటగాళ్ల మినీ వేలం పాటను నవంబర్ 27న నిర్వహించనున్నారు. రాజధాని ఢిల్లీ వేదికగా ఈ వేలం పాట జరుగనుంది. వేలం పాటలో పాల్గొనే ఆటగాళ్ల తుది వివరాలను భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈసారి జరిగే వేలం పాటలో 277 మంది క్రికెటర్లు బరిలోకి నిలువనున్నారు. ఇందులో 194 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 52 మంది కాప్డ్ ప్లేయర్లు, మరో 142 మంది అన్ కాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అంతేగాక 66 మంది కాప్డ్ విదేశీ క్రికెటర్లు కూడా వేలం పాటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరో 17 మంది అన్ కాప్డ్ విదేశీ ఆటగాళ్లు కూడా బరిలో నిలువనున్నారు. కాగా, ఐపిఎల్‌లోని ఫ్రాంచైజీలు కలిపి మినీ వేలం పాటలో 73 మంది క్రికెటర్లను కొనుగోలు చేయనున్నాయి.