హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు మొత్తం భూములపైనే ఉంటుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ లో భూములు ఉన్న చోట రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలానగర్, నాచారం, జీడిమెట్ల, హైదరాబాద్ లో భారీగా భూ కుంభకోణం జరుగుతోందని కెటిఆర్ మండిపడ్డారు. 9,300 ఎకరాల్లో భూకుంభకోణానికి ప్రభుత్వం, రూ. 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కేబినెట్ భేటీలో తెరలేపిందని ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి అనుచరులకు, బంధువులకు ఇచ్చేందుకు కేబినెట్ భేటీలో తెరలేపిందని కెటిఆర్ ఎద్దేవా చేశారు.