మన తెలంగాణ/ హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే హైదరాబాద్ జట్టు ఎంపిక కోసం హెచ్‌సిఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాబబుల్స్ పోటీల్లో యువ బ్యాటర్ హృషికేశ్ సింహా అద్భుత బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఎన్‌ఎఫ్‌సి గ్రౌండ్‌లో హెచ్‌సిఎ గ్రీన్‌తో జరిగిన ప్రాబబుల్స్ మ్యాచ్‌లో హృషికేశ్ 52 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో హృషికేశ్ పది ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. హృషికేశ్ విధ్వంసక శతకం సాధించడంతో హెచ్‌సిఎ బ్లూ టీమ్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్రీన్ టీమ్ 6 వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అంతకుముందు ఎన్‌ఎఫ్‌సి గ్రౌండ్‌లోనే హెచ్‌సిఎ రెడ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో హృషికేశ్ 41 బంతుల్లోనే అజేయంగా 83 పరుగులు సాధించాడు.