దోహా: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్‌లో భారత్ ఎ జట్టు సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ ఎ జట్టుతో జరిగిన ఈ పోరులో సూపర్ ఓవర్‌లో ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ నిర్ణీత 20 ఓశర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో హబీబుర్ రెహమాన్ సోహన్ 65, మెహరబ్ 48 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను గెలిపించేందుకు అందరూ ఆటగాళ్లు సమిష్టిగా కృషి చేశారు. ప్రియాంశ్ ఆర్య 44, వైభవ్ సూర్యవంశీ 38, జితేశ్ శర్మ 33, నేహల్ వదేరా 32 పరుగులతో రాణించారు. కానీ, భారత్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. సూపర్ ఓవర్‌లో బంగ్లా బౌలర్ రిపొన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారత్ తరఫున సుయాష్ శర్మ కూడా తొలి బంతికి వికెట్ తీశాడు. కానీ, రెండో బంతి వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎ, బంగ్లాదేశ్ ఎ మధ్య జరిగే మరో సెమీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుతో బంగ్లాదేశ్ నవంబర్ 23న జరిగే ఫైనల్లో తలపడనుంది.