హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే విచారించారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు వీరిద్దరితో పాటు అమృత చౌదరీని కూడా సిఐడి అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌తో లావాదేవీలపై వీరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, విష్ణుప్రియలను కూడా సిఐడి సిట్ విచారించింది. సిట్ అధికారుల సూచనల మేరకు బ్యాంకు స్టేట్‌మెంట్లను రానా సమర్పించారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు? తీసుకున్న పారితోషికం ఎంత? బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది? ఎవరు మీతో ఈ అగ్రిమెంట్లను కుదుర్చుకున్న వివరాలపై సీఐడీ ఆరా తీసింది.