పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్‌లో ఓ గ్లూ (గమ్) తయారు చేసే ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రమాదం తరువాత ఫ్యాక్టరీ యజమాని పరారయ్యాడు. మేనేజర్‌ను స్థానిక పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనంతోపాటు చుట్టుపక్కల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పంజాబ్ సిఎం మరయం నవాజ్ షరీఫ్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే ఫైసలాబాద్‌లో బాయిలర్ పేలి 12 మంది మరణించారు. వారం రోజుల క్రితం కరాచీ లోని ఓ బాణాసంచా తయారీ కేంద్రం లోనూ పేలుడు సంభవించి నలుగురు చనిపోయారు.