యుఎఇ: దుబాయ్ ఎయిర్‌షోలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన ఎయిర్‌షోలో భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. భారత్ ఎరోనాటికల్ డెపలప్‌మెంట్ ఏజెన్సీ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లు సంయుక్తంగా ఈ విమానాన్ని రూపొందించాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అయితే ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? లేదా పైలట్ తప్పిదమా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే పైలట్ పరిస్థితి గురించి ఇంకా సమాచారం లేదు. విమానం కూలిన సమయంలో పైలట్ తప్పించుకున్నట్లు తెలియరాలేదు. పైలట్ క్షేమ సమాచారం గురించి భారత వైమానిక దళం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.