ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజనగరం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..పాఠశాల ఆవరణలో కళావేదిక నిర్మాణం జరుగుతోంది.కళావేదిక కు శ్లాబ్ వేసేందుకు క్రేన్ సహాయంతో సామాగ్రిని తరలిస్తుండగా క్రేన్ కూలి ఇంగ్లీష్ టీచర్ జోష్నా భాయ్(45) పై సామాగ్రి పడింది. ఈ ఘటనలో టీచర్ కు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చనిపోయారు.పాఠశాల సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.