బ్రెజిల్ లోని బెలెమ్‌లో నిర్వహిస్తున్న కాప్ 30 సదస్సులో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది గాయాల పాలయ్యారు. మైక్రోవేవ్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. గురువారం బ్లూజోన్‌లో మంటలు చెలరేగడంతో వేలాది మంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు లోకీ తీసుకురాగలిగారు. ప్రమాద సమయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఇక్కడే ఉన్నారు. భద్రతా రక్షణ అధికారులు వెంటనే వారిని బయటకు తరలించారు.