జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో… క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న మూవీ ‘జిఒఎటి’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం చివరి దశకి చేరుకుంది. గురువారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ వాయిస్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ సాంగ్ లో సుధీర్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.