తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగాతెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గురువారం షాద్‌నగర్ లో పర్యటించారు.గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. ఆస్పత్రి వైద్యులతో సిబ్బందితో పాటు రోగులను అడిగి పలు విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో కవిత మాట్లాడుతూ.. ఆసుపత్రిలో వైద్య సేవల స్థాయిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి కేవలం నిరుపేదలు మాత్రమే వస్తారని అలాంటి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే సకల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో భవనం పెచ్చులూడిపోతుందని, ఎప్పుడు కురుస్తుందో తెలియదని వెంటనే దీనిని వంద పడకల ఆసుపత్రికి నూతన భవనంలో వైద్య సేవలను బదిలీ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి నిధులు ప్రభుత్వం ద్వారా రావడంలేదని దీంతో అరకొర వసతులతో సదుపాయాలతో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం లభించడం లేదని కవిత విమర్శించారు. ఇక్కడ రోగులకు మందులు ఇవ్వాలన్న లేక అనేక సదుపాయాలు కల్పించాలన్న నిధులు ఎంతో ముఖ్యమని ప్రభుత్వం ఆ దిశగా దృష్టిని సాటించాలని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె డిమాండ్ చేశారు. తను ఈ ఆస్పత్రి సందర్శించాక తను రెండు విషయాలు గుర్తించడం జరిగిందని శిథిలమైన భవనాన్ని వెంటనే వంద పడకల ఆసుపత్రికి మార్చాలని, అదేవిధంగా నాణ్యమైన వైద్య సేవల కోసం సిబ్బంది సంఖ్య పెంచాలని ఆమె కోరారు. గత నెల ఆసుపత్రిలో 120 ప్రసవాలు జరిగాయని, గైనకాలజిస్టుల కొరత ఉందని ఆరు మందికి ఒకరే ఉన్నారని పేర్కొన్నారు. 28 మంది సిబ్బందికి 12 మంది ఉన్నారని ఈ స్థాయి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.