మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సం స్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి) సిద్ధమవుతోంది. ఈనెల 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో గ్రామ పం చాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. గ్రామ పంచాయతీల్లో 50 శాతానికి లోబడి ఎస్సి,ఎస్టి, బిసి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నివేదికకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలు వెంటనే జిల్లాల్లో ఆ యా పంచాయతీల వారీగా జనాభా ఆధారంగా రిజర్వేషన్ల ఖరారుకు చేయనుంది. ఒ కటి రెండు రోజుల్లోనే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీల వా రీగా రిజర్వేషన్లను సిద్ధం చేస్తారు. ఈ నెల 24న హైకోర్టులో రిజర్వేషన్ల అమలుపై వి చారణ ఉన్న నేపథ్యంలో ఆలోపే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి,
హైకోర్టుకు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. పంచాయతీల్లో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎన్నికలు నిర్వహించుకునేందుకు గతంలో హైకో ర్టు అనుమతించిన విషయం తెలిసిందే. కా గా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నిక లు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. పంచాయతీల్లో ఓటరు జాబితా మ రోసారి సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి) షెడ్యూల్ ప్రకటించిన సంగతి తె లిసిందే. ఈ నెల 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వార్డుల మ్యాపింగ్‌లో తప్పుల సవరణ (అడ్రస్‌లో మార్పు లేకుండా కేవలం వార్డు మార్పులు మాత్రమే) అవకాశం కల్పించింది.
సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ/వార్డు/పోలింగ్‌స్టేషన్ వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల్లో మిస్ మ్యాపింగ్‌పై ఓటర్ల నుంచి దరఖాస్తు స్వీకరణ, వాటి పరిశీలన 22వ తేదీన అందిన ఫిర్యాదులు, అభ్యర్థనలు, అభ్యంతరాలను సంబంధిత డిపిఒల ద్వారా పరిష్కారించనున్నారు. 23వ తేదీన సంబంధిత గ్రామపంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు తిరిగి ప్రచురించాలి. అందులో ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, మ్యాపింగ్‌లో తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుతారు. పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం.. ఓటర్ల జాబితాను పరిశీలించి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ ప్రచురిస్తారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తవ్వగానే.. ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. 31 జిల్లాల్లో 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించి, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా.. గత సెప్టెంబర్ 2న వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు.
సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించాలి: కమిషనర్ రాణి కుముదిని
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. ఈ ఎన్నికల నిర్వహణపై గురువారం జిల్లా కలెక్టర్లు,ఎస్పిలు, ఉన్నతాధికారులతో కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఇసి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డి.జి.పి. శివధర్ రెడ్డి,ఇతర ఎన్నికల సంఘం అధికారులతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు.