రెండు నెలల క్రితం చెలరేగిన జెన్‌జడ్ ఆందోళనలు చివరకు అప్పటి ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రుల రాజీనామాకు దారి తీసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జెన్‌జడ్ ఆందోళనలు చెలరేగాయి. మాజీ ప్రధాని కేపీ శర్మ మద్దతుదారులు, యువ నిరసన కారుల మధ్య సిమారా పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల వారు ర్యాలీలు నిర్వహించారు.సాధారణ పరిస్థితులు లేకపోవడంతో గురువారం రాత్రివరకు అధికారులు కర్ఫూ విధించారు. ఈ సందర్భంగా నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కీ ప్రజలంతా రాజకీయంగా రెచ్చగొట్టే సమాచారానికి దూరంగా ఉండాలని , ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం ఉంచాలని పిలుపునిచ్చారు.