పాట్నా: పట్టపగలు నడిరోడ్డును టీచర్‌ను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన బిహార్ రాష్ట్రం ముజప్ఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తోరౌరా ప్రాంతంలో కైలాశ్ అనే టీచర్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కైలాశ్ కోచింగ్ క్లాస్‌లు చెప్పి తన సోదరుడి కలిసి ఇంటికి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి టీచర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. కైలాశ్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీంతో సోదరుడు షాక్‌లో ఉండిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదమే ఈ హత్యకు కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.