నెల్లూరు లేడీ డాన్ అరుణ కు బెయిల్ మంజూరు అయింది. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూళ్లు చేసి కేసులో ఆమెను సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయ వాడ కోర్టును అరుణ కోరారు. ఆమె పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.25 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. దీంతో ఆమె నెల్లూరు జైలులో జుడీషియర్ రిమాండ్ ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ మంజూరు కావడంతో అరుణ జైలు నుంచి శుక్రవారం విడుదల కానున్నారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ పేరు విపరీతంగా వినిపించింది. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో శ్రీకాంత్‌ను ఆమె జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. అంతేకాదు జగన్ ప్రభుత్వ హయాంలో పలువురిని బెదిరించినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి. దీంతో అరుణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.