జాన్వీ కపూర్ చూస్తుండగానే తెలుగు నేర్చేసుకొంది. దేవర షూటింగ్ పూర్తి చేసేటప్పటికే కొంత నేర్చుకొంది. కానీ ఇప్పుడు పూర్తిగా గలాగలా మాట్లాడేస్తోంది. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. మూఢు భాషల్లో తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. అందుకే ఆమె ఆలిండియా స్టార్ అనిపించుకున్నారు. ఇక జాన్వీకి హిందీ, తమిళం ముందు నుంచే వచ్చు. ఇంగ్లీష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా తెలుగు కూడా బాగా నేర్చుకొని మాట్లాడుతోంది. పెద్ది సినిమా వల్ల ఆమెకి తెలుగు మీద మంచి పట్టు వచ్చిందట. దేవర సినిమా టైంలోనే ఆమె తెలుగు బాగా నేర్చుకొని మాట్లాడుతాను అని తన తెలుగు అభిమానులకు మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఇప్పుడు తెలుగులో మాట్లాడుతోంది. మరి భవిష్యత్ లో తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటుందా అనేది చూడాలి. పెద్ది సినిమాలో ఈ భామ రామ్ చరణ్‌కి చికిరిగా నటించింది. ఆ పాట ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.