రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్ -2026) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మెరుపు యాప్ ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులను అందిస్తోంది. టెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల అయింది. జనవరి మొదటివారంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి డి.ఎడ్, బి.ఇడి పూర్తి అయిన విద్యార్థులతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా ఈ టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రిపరేషన్‌కు వీలుగా మెరుపు యాప్ ఈనెల 21 తేదీ నుంచి డిసెంబర్ 21 వరకు నెల రోజుల పాటు రోజూ ప్రాక్టీస్ టెస్ట్‌లను అందిస్తోంది. అభ్యర్థులు ఎక్కడి నుంచైనా.. ఏ సమయంలోనైనా.. ఎలాంటి రిజిస్ట్రేషన్, ఎంట్రీ ఫీజులు లేకుండానే ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులను వినియోగించుకోవచ్చు. టెట్ నూతన సిలబస్ ఆధారంగా గతంలో టెట్ పరీక్షల ప్రశ్నల సరళికి అనుగుణంగా, నిపుణులైన అధ్యాపక బృందంచే తయారు చేయబడిన బిట్ బ్యాంకు, గత ప్రశ్నాపత్రాలు, మెరుపు యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే అభ్యర్థులు తమ సెల్ ఫోన్లలో మెరుపు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని టెట్ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని యాప్ నిర్వాహకులు కోరారు.