ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్నూల్ లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ “ఆంధ్ర కింగ్ అనేది నా కెరీర్‌లోనే స్పెషల్ సినిమా. సంగీత దర్శకులు వివేక్, మెర్విన్ తెలుగులో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు.
ఈ సినిమాలో నేను అభిమాని పాత్ర పోషించాను. సూపర్ స్టార్ పాత్రని ఉపేంద్ర పోషించారు. ఇది అభిమానుల సినిమా”అని అన్నారు. డైరెక్టర్ మహేష్ బాబు పి మాట్లాడుతూ “మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉపేంద్రతో వర్క్ చేయడం కూడా అదృష్టం”అని పేర్కొన్నారు. నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ “డైరెక్టర్ మహేష్ అద్భుతమైన సినిమా తీశారు. చాలా కాలం మాట్లాడుకునే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ, వివేక్, మెర్విన్ పాల్గొన్నారు.