భారత సంతతికి చెందిన చీతా ముఖి ఐదు కూనలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో చీతా పిల్లల్ని కనడం ప్రాజెక్టు చీతాకు మైలు రాయివంటిదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం అభివర్ణించారు. భారత్‌లో మొదటగా జన్మించిన స్వదేశీ చీతా ఇప్పుడు తిరిగి పిల్లలను కనే మొదటి భారత చీతాగా రికార్డుకెక్కింది. దేశంలో చీతాల సంతతి క్షీణించుకుపోవడంతో 2022 సెప్టెంబరు 17న భారత్‌లో చీతాలను తిరిగి ప్రవేశ పెట్టారు.