గాడ్ ఆఫ్ ది మాసె స్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తు న్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’అఖండ 2: తాండ వం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ సెకండ్ సింగిల్‌గా ‘జాజికాయ’ అంటూ సాగే పవర్‌ఫుల్ మాస్ డ్యాన్స్ నెంబర్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో గ్రాండ్‌గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త తదితరులు హాజరై ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.
ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..“అఖండ ఫస్ట్ పార్ట్ మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో చూశారు. ఇప్పుడు సీక్వెల్ ‘అఖండ: తాండవం’ పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కాబోతోంది. ఇప్పుడు రిలీజ్ అయిన పాట కుటుంబం పండగ చేసుకునే నేపథ్యంలో వచ్చే సాంగ్. తమన్ ఈ పాటకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు”అని చెప్పారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ..“సినిమాలో అనంతపురంలో జరిగే బర్త్ డే పార్టీలో వచ్చే పాట ఇది. సంయుక్త మీనన్ చేసిన ఫస్ట్ మాస్ సాంగ్ ఇది. ఈ సాంగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. ”అని తెలియజేశారు. నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ..“మంచి హైఓల్టేజ్ ఎనర్జీ ఉన్న ఫాస్ట్ బీట్ సాంగ్ ఇది. బాలయ్య ఎనర్జీకి, స్టైయిల్‌కి మ్యాచ్ అయ్యేలా ఉంటుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త పాల్గొన్నారు.