హైదరాబాద్: అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటి వి విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ న్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. 15 ఏళ్లు ఓ జంటకు నరకం చూపించిన కథను తీసుకరాబోతున్నానని దర్శకుడు సాయి కంపాటి తెలిపారు. భావోద్వేగంతో కూడిన సినిమాలో ఎక్కువగా ఎమోషనల్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్థనగ్నంగా తిరుగుతానని సవాల్ విసిరారు. దీనిపై నెగిటివ్ ప్రచారం చేయవద్దని కోరారు. సినిమా నచ్చకపోతే వదిలేయాలని, నెగెటివ్ కామెంట్లు చేయకండని విజ్ఞప్తి చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని తనకు నమ్మకం ఉందని, ఈ చిత్రం వెనుక ఎంతో మంది కష్టపడ్డారన్నారు. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని ప్రశంసించారు. పల్లెటూరు కథతో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశానని తెలిపారు. గ్రామాలలో పొలం పనులు చేసుకునే మనుషులు, అమాయకంగా ఉండే ఆటో డ్రైవర్లు, కాలేజీల్లో అమ్మాయిల మధ్య మొరటు ప్రేమ పుడుతుందనే సినిమా ఉంటుందని వివరించారు. సినిమా యూనిట్‌తో కలిసి ఎంతో ఇష్టం పల్లెటూరి కథను తీస్తున్నానని పేర్కొన్నారు. విమానంలో వచ్చే హీరోలు, ట్రైన్ నుంచి దిగే హీరోయిన్ల గురించి తాను కథను రాయలేనని చెప్పారు.