లిప్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నగరంలో ఎల్లారెడ్డి గూడలోని కీర్తి అపార్ట్‌మెం ట్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉండే నరుసు నాయుడు చిన్న కుమారుడు హర్షవర్ధన్(5) మధురానగర్‌లోని శ్రీనిధి పాఠశాలలో ఎల్‌కెజి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి తల్లి, సోదరుడితో పాటు ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్ట్‌లో ఐదో అంతస్తులోకి వెళ్లాడు. తిరిగి కిందకు దిగుతున్న సమయంలో 4,5 అంతస్తుల మధ్య లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే బాలుడిని బయటకు తీయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి మృతితో అపార్ట్‌మెంట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.