రాష్ట్రస్ధాయి క్రికెట్ పోటీలకు పట్టణంలోని తెలంగాణ మైనార్టీ కళాశాల ఇంటర్ ద్వితియ సంవత్సరం విద్యార్ధి ఎస్‌కే షాహిద్ ఎంపికయ్యాడు. ఇటీవల ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్‌జిఎఫ్ అండర్ 19 క్రికెట్ సెలక్షన్‌లో షాహిద్ అత్యుత్తమ ప్రతిభ చూపాడు. అందులో భాగంగా ఈనెల 23వ తేదిన హెద్రాబాద్‌లో జరిగే రాష్ట్రస్ధాయి క్రికెట్‌లో పాల్గోననున్నాడు. విద్యార్ధి షాహిద్‌ను కళాశాల ప్రిన్సిపాల్ ముదస్సార్ హుస్సేన్, ఉపాధ్యాయులు సైదులు, అశోక్, సాధిక్, నర్మదా, ఉషారాణి, రజని, శిరిష, రేష్మ, శిరిష, ప్రసాద్, మహేశ్వరి, నజీముద్ధీన్‌లు అభినందించారు.