మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం నక్సల్స్, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావో యిస్టు పార్టీకి చెందిన నక్సల్స్ మరణించినట్టు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ము గ్గురు మహిళలు ఉండగా, వీరిలో కీలక నేత మెట్టూరి జోగారావు అలియాస్ ‘టెక్ శంకర్’గా ఉన్నట్టు ఆయన మీడియాకు వివరించారు. జోగా రావు శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తి కా గా మిగతా వారు చత్తీస్‌గఢ్‌కు చెందినవారని తెలిపారు. మృ తులలో సీత అలియాస్ జ్యోతి, సురేశ్, గణేష్, వాసు, అని త, షమ్మీగా గుర్తించినట్టు తెలిపా రు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కొంతకాలంగా నక్సల్స్ కార్యకలాపాల అణచివే త పె రుగుతుండటంతో వారంతా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మహేశ్ చం ద్ర లడ్డా తెలిపారు. దీంతో వారి కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఈ నెల 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టగా, మంగళవారం మారేడుమిల్లిలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మాతో సహా ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎన్టీఆర్ కృషా జిల్లా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మంగళవారం 50 మం ది మావోయి స్టులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. వా రి వద్ద నుంచి 45 ఆయుధాలు, 272 రౌండ్ల బుల్లెట్లు, 2 మేగజైన్లు, 750 గ్రాముల వైర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, కచ్చితమైన ప్రణాళికతో ఆపరేషన్ జరిగిందని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్టు తెలిపారు. తమ ఇంటిలిజెన్స్ విభాగం చాలా బాగా పని చేసిందని ప్రశంసించారు. ఇటీవల కొంతమంది మావోయిస్టు నక్సల్స్ తెలంగాణలో లొంగిపోయారని ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన మావోయిస్టులు తలదాచుకునేందుకు ఏపీలోని పలు ప్రాంతాలను ఎంచుకున్నారని, అయితే తమకు లభించిన పక్కా సమాచారంతో ఆపరేషన్ చేపట్టిన్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారి కదలి కలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయని చెప్పారు. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న క్రమంలో మావోయిస్టు నక్సల్స్ ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాన్ని వదిలి ఎపికి మకాం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లాతో సహా ఇతర ఏజెన్సీ జిల్లాల్లో మావోయిస్టుల కదలకలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
ఎదురు కాల్పుల్లోనే హిడ్మా మృతి
జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాసిన విషయం తమకు తెలియదని లడ్డా తెలిపారు. హిడ్మా ఎదురు కాల్పుల్లోనే లోనే మృతి చెందారని ఆయన స్పష్టం చేశారు. ఆయనను పట్టుకు న్నాక చంపారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల ప్లాన్ ఏమిటో, కానూరులో ఎందుకున్నారో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలో చాలా మంది లొంగి పోతారని వెల్లడించారు. అరెస్టుల వల్ల భయపడా ల్సిన అవసరం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయన్నారు. దీంతో అక్కడ్నించీ ఇతర ప్రాంతాలకు మావోయిస్టులు వెళ్తున్నారన్నారు. ఈ క్రమంలో పట్టుబడుతున్నారని ఎడిజి మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు.
ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు రిమాండ్
ఏలూరు గ్రీన్ సిటీ లో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు కోర్టు రిమాండ్ విధించింది. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా కేంద్ర బలగాలు విజ యవాడలో 32 మంది, ఏలూరులో 12 మంది, కాకినాడలో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి బుధవారం ఏలూరు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వారికి ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అలాగే వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. విజయవాడలో పట్టుబడిన 24 మంది మావోయిస్టులను రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అలాగే మరో నలుగురు మావోయి స్టులకు వయోపరిమితి నిర్ధారించాలని ఆదేశించింది.
న్యాయ విచారణ జరపాల్సిందే : సిపిఎం డిమాండ్
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో మంగళ, బుధవారం జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం ఏపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్ట విరుద్ధమైన బూటకపు ఎన్‌కౌంటర్లను సిపిఎం ఖండిస్తుందని తెలిపారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు, వారి అనుయాయులను నిర్బంధించారన్నారు.వివిధ చోట్ల నిర్బంధించబడిన వీరిని వెంటనే సంబంధిత న్యాయ స్థానాల ముందుంచాలని కోరారు. అమాయక గిరిజనులను మావోయిస్టులకు సహకరిస్తున్నారని, మిలిషియాగా పనిచేస్తున్నారని పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. వేధింపులను, నిర్భందాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఎం నేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.****