పట్ట పగలే భారీ దొంగతనం జరిగిన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని జెపి నగర్ లో గల ఒక ప్రైవేటు బ్యాంక్ బ్రాంచ్ నుంచి వ్యాన్ లో క్యాచ్ ను ఎటిఎంకు తరలిస్తుండగా అశోకా పిల్లర్ ప్రాంతంలో వ్యానుకు కారు అడ్డంగా పెట్టి అందులోంచి నలుగురు కిందికి దిగి మేము పన్ను విభాగ అధికారులమని పత్రాలు చూపించాలని వ్యాన్ లో ఉన్న వాళ్లను అడిగారు. వ్యాన్ సిబ్బంది స్పందించే లోపే వ్యాన్ లో ఉన్న క్యాచ్ ను కారులోకి ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యారు. వ్యాన్ 7 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం. వ్యాన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతకటం ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సిసిటివి పుటేజిని పోలీసులు పరిశిలిస్తున్నారు.