నాంపల్లిలోని సింగరేణి భవన్ వద్ద ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి భవన్ ను కవిత ముట్టడిస్తుందన్న సమాచారంతో పోలీసులు ముందుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఆటలో సింగరేణి భవన్ కు చేరుకుని ముట్టడికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సింగరేణి లో డిపెండెంట్ ఉద్యోగాల్ని పునరుద్ధరించాలని కోరుతూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కవిత సింగరేణి భవన్ ను ముట్టడికి యత్నించారు. కార్మికుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.