హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ఎలా గెలిచారో సిఎం రేవంత్ రెడ్డి అంతరాత్మకు తెలుసు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రాయించుకున్న, వేయించుకున్న ఓట్లతో జూబ్లీహిల్స్ లో గెలిచారని విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లు రాయించి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపు కోసం అందరం కృషి చేద్దామని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎవరికి సమస్య వచ్చినా తెలంగాణ భవన్ కు రావచ్చునని, స్థానిక ఎన్నికలు పూర్తి కాగానే బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపడతామని కెటిఆర్ పేర్కొన్నారు.