దిగ్గజ దర్శకుడు రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ఆయన తాజా చిత్రం టైటిల్ ప్రకటన ఈవెంట్ ఈ నెల 15వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో టైటిల్ ప్రకటనతో పాటు చిత్రానికి సంబధించిన చిన్న గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టాయి. రాజమౌళి ఈ ఈవెంట్‌లో హనుమంతుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉణ్నాయని.. రాష్ట్రీయ వానర సేన సభ్యులు ఫిర్యాదు చేశారు. మరి ఈ కేసుపై పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. ‘#SSMB29’ అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తున్నారు. ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇంతకు మించి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ బయటకు రాలేదు.