నేటి నుంచి యథావిధిగా కొనుగోళ్లు రైతులు ప్రతిపక్షం ఉచ్చులో పడొద్దు మిల్లర్లు పోరాడాల్సింది కేంద్ర
సిఐఐతో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : -జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు సఫలమయ్యాయని, నేటి నుండి యధావిధిగా పత్తి కొనుగోళ్లు జరుగుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై సిసిఐ ఎండిలలిత్ కుమార్‌గుప్తా, జి న్నిం గ్ మిల్లర్ల అసోషియేషన్‌తో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించామని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృ షి చేస్తానన్నారు. రైతుల సమస్యలను రెట్టింపు చేసేలా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు స మ్మెకుదిగడం సమంజసం కాదన్నారు.
జిన్నిం గ్ మిల్లుల సమస్యలపై సమ్మెతో కాకుండా, సామరస్యంగా కేంద్రంతో పోరాడుదామని, అందుకోసం ప్రభుత్వం పూర్తి సహకారం అం దిస్తుందని మంత్రి తెలియజేశారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై ఒక నివేదిక తయారుచేసి కేంద్ర జౌళిశాఖ అధికారులకు పంపాలని వ్య వసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ని మంత్రి ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలను పరిష్కరించేందకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తుందని, పత్తి కొనుగోళ్ళు యథాతథంగా ప్రారంభించాలని జి న్నింగ్ మిల్లుల యాజమాన్యాలను మంత్రి కో రారు. తక్షణమే నోటిఫై చేసిన అన్ని జిన్నింగ్ మిల్లులను ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ప్రభు త్వం మొక్కజొన్న కొనుగోళ్ల పరిమితిని 18 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్లకు పెంచి కొనుగోళ్లు చేస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్ర భుత్వ నిబంధనల ప్రకారం నాఫెడ్ సేకరించే 25 శాతం సోయా చిక్కుడు పరిమితిని ఎకరానికి 6.72 క్వింటాళ్ల నుండి 10 క్వింటాళ్లకు పెంచి సేకరించాలని మార్క్ ఫెడ్ అధికారులను మంత్రి ఆదేశించారు. కౌలు రైతులకు ఇబ్బందులు కలగకుండా నాఫె డ్ తీసుకొచ్చిన ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొ బైల్ ఒటిపితో కూడా కొనుగోళ్లు జరపాలని మార్క్ ఫెడ్ అధికారులకు సూచించారు.
కేంద్రం వల్లే రైతుల ఇబ్బందులు
సీజన్ ఆరంభంలో పత్తి కొనుగోళ్లలలో రైతుల సౌలభ్యం కోసం, కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే యాప్‌ను తీసుకొచ్చిందని,ఈ యాప్‌తో రైతులకు సౌలభ్యం కలగకపోగా, మరి న్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. సీజన్ మొ దట్లో ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసి, ఒక్కసారిగా ఆ పరిమితిని 7 క్విటాళ్లకు తగ్గించి కొనుగోలు చేస్తామనడంతో రైతులు తమ మిగిలిన పంటను ఎక్కడా అమ్ముకోవాలో తేలియని పరిస్థితికి కేంద్రమే కారణమన్నారు. అనంతరం జిన్నిం గ్ మిల్లుల విషయంలో సైతం కేంద్రమే నిర్ణయం తీసుకుంటామని చెప్పి, జి న్నింగ్ మిల్లులను తామే కేటాయిస్తామని, కేటాయించిన జిన్నింగ్ మిల్లులను ఎల్1 నుండి ఎల్2 లుగా విభజించి, జిన్నింగ్ మిల్లర్లను కూడా ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన జిన్నింగ్ మిల్లర్లు, పత్తి కొనుగోళ్లు నిలిపేశారని, వీటికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిన నిర్ణయాలే కారణమని మంత్రి ఆరోపించారు.
జిన్నింగ్ మిల్లర్లకు కేంద్ర తీసుకునే నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే, కేంద్రంతో పోరాడాలని, రైతులకు ఇబ్బంది కలిగించడం సమంజపం కాద న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పత్తి కొ నుగోళ్లలో ఎలాంటి సంబంధం లేకున్నా, రైతు లు నష్టపోకూడదనే ఉద్దేశంతో జిన్నింగ్ మిల్లుర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపామన్నారు. రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడోద్దని మం త్రి తుమ్మల కోరారు. ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతోనే బిఆర్‌ఎస్ నాయకులు, లేని గొప్పలు చెప్పుకుంటూ రైతులను, రాష్ట్ర ప్రజల ను మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలు కనపడని బిఆర్‌ఎస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపి జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో పత్తి కొనుగోలుకు ఒప్పిస్తే తమ వల్లనే అని గొప్పలు చెప్పుకుంటు తిరుగుతున్నారని ఆరోపించారు. పత్తి రైతుల కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చోరవ రాష్ట్ర రైతులకు తెలసుని, బిఆర్‌ఎస్ నాయకులు కళ్లు ఉన్న కబోదిలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలపై కేంద్రంతో పొరాడి సమస్యను కొలిక్కి తీసుకొస్తే, ఇదంతా మేము ప్రశ్నిస్తేనే అయిందనడం, ‘వాన వచ్చాక మేఘాలను లెక్కేసినట్టు’గా ఉందని మంత్రి ఎద్దేవా చే శారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.