హైదరాబాద్: బేగంపేట బస్ స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. థార్ వాహనాన్ని వెనుక నుంచి భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో థార్ వాహనం నుజ్జనుజ్జయింది. ట్రక్ అక్కడే బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. థార్ వాహనంలో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది.