ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్‌కె గోల్డెన్ ఆర్ట్, చందమామ క్రియేషన్స్, ఎన్‌విఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం ‘టార్టాయిస్’. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రల్లో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “టార్టాయిస్‘ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ, దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగుంది”అని తెలిపారు. దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ “రాజ్ తరుణ్ కి కెరీర్ లో బెస్ట్ సినిమా ఇదవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ కథతో వస్తున్న మంచి థ్రిల్లర్ చిత్రమిది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం”అని అన్నారు.