హిడ్మా స్కెచ్ గీస్తే తిరుగుండదు
భారీ దాడులకు ప్రధాన వ్యూహకర్త
మావోయిస్టు కేంద్ర కమిటీలో
అతి పిన్న వయస్కుడు
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో నాగరికత సరిగ్గా లేని ఒక ఆదివాసి గ్రా మం అయిన పూన్వర్తికి చెందిన హిడ్మా 1981లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు. 5వ తరగతి వరకే చదువుకున్న ఆయన 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరి అనతికాలంలోనే మంచిపేరు సంపాదించుకున్నాడు. మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడుల్లో దిట్టగా పేరుపొందాడు. పార్టీ అప్పగించిన ఏ పనినైనా సులభంగా చేసే నైపుణ్యం కలిగి ఉండేవాడు. విలాస్, హిడ్మాల్, అనే పేర్లతో కూడా అతనిని పిలుస్తారు. హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై మంచి పట్టు ఉంది. ప్రస్తుతం ఆయన వయసు 43 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)-1వ బెటాలియన్‌కు కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు. సిపిఐ మావోయిస్టుల అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడు ఆయనే. బస్తర్ ప్రాంతం నుంచి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు కూడా ఆయనే. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్యర్యంలోనే పూర్తి స్థాయి శిక్షణ ఉంటుంది.
పిఎల్‌జిఎతోపాటు మిలీషియా సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కు పైగా ఘటనలకు హెడ్మానే సూత్రధారి. దండకారణ్యంలో మావోయిస్టు కమిటీల్లో కీలకంగా మారిన హిడ్మాకు సైనిక ఆపరేషన్, గెరిల్లా యుద్ధతంత్రంలో ప్రధాన వ్యూహకర్తగా పేరుంది. ప్రస్తుతం హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) ప్లాటూన్-1 కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది. భారీ ఆపరేషన్లలో హెడ్మాది మాస్టర్ మైండ్. భారీ దాడుల్లో స్వయం గా పాల్గొంటూ కేంద్ర బలగాలకు కొరకరాని కొయ్యగా మారాడు. మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై అప్పట్లో పార్టీలో చాలా విభేదాలు వచ్చా యి. ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమేనని కొంతమంది మావోయిస్టులు అభ్యంతరం పెట్టారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకున్నాడని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన నీడను కూడా హిడ్మా నమ్మడని, దాదాపు 10 మందిని తనకు రక్షణగా నియమించుకున్నాడని లొంగిపోయిన మావోయిస్టులు చెప్పేవారు. హిడ్మాను ఎవరూ చంపలేరని మావోయిస్టు పార్టీలో ఒక గట్టి నమ్మకం కూడా ఉండే.
మావోయిస్టుల్లో హీరో హిడ్మా
ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశాబ్దాలుగా జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే వ్యూహకర్తగా, సాక్షిగా నిలిచాడు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన అనేక కీలక దాడుల్లో వందలాది మంది పోలీసులు, జవాన్లు మృతి చెందా రు ఛత్తీస్‌గఢ్‌లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. కూంబింగ్ ఆపరేషను చేసే పోలీస్ బలగాలపై, సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు చేయడంలో అందవేసిన చె య్యి. దండకారణ్యంపై పూర్తి పట్టు ఉన్న హిడ్మా ఆధ్వర్యంలోనే మవోయిస్టు పార్టీలోని పరిశోధన అభివృద్ధి విభాగం పనిచేస్తోంది. 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా, తాడిమెట్ల అటవీ ప్రాం తంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందుపాతరలతో పే ల్చి వేసి కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది.
ఇందులో 74 మంచి సిఆర్‌పిఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. అప్పట్లో సంచలనం గా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. 2017 మార్చి 17న సుక్మా జిల్లా, బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తచెరుపు దగ్గర రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 25 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెం దారు. 2017 ఏప్రిల్ 24న ఇదే జిల్లా చింతగుప్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్మాపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. నిర్మాణ పనులకు భద్రతగా వెళ్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో 24 మంది జవాన్లు చనిపోయారు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా, కాసారం అటవీ ప్రాం తంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు.
20 20 ఫిబ్రవరిలో ఇదే జిల్లా, పిడిమెట అటవీ ప్రాంతంలో మందు పాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది సిఆర్ పి జవాన్లు మృతి చెందారు. ఇటీవల జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు. హిడ్మా స్కెచ్ గిస్తే ఎవరూ త ప్పించుకోలేరని మావోయిస్టు పార్టీలో గట్టి నమ్మకం. చా లాకాలం పాటు పోలీసులకు సైతం తన ఫొటో కూడా దొ రకకుండా జాగ్రత్తపడిన హిడ్మా గురించి మావోయిస్టు కే డర్లోనే చాలా మం దికి తెలియదు. సుక్మా జిల్లా, మళ్లి, ని షాద్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టు విభాగంలో చేర్పించి, వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి పిఎల్‌జిఎలో నియమించుకున్నాడు. చాలా భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయాడు. పలుమార్లు కేంద్ర భద్రతా బలగాల నుంచి తప్పించుకున్న విషయం విదితమే.
పట్టుకెళ్లి కాల్చారు: పౌరహక్కుల సంఘం
విజయవాడ ప్రాంతంలో తలదాచుకున్న ఆరుగురిని పోలీసులే పట్టుకెళ్లి కాల్చిచంపినట్లుగా సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్యం, పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. చిత్రహింసలకు గురిచేసి కిరాతకంగా హత్యచేసి మారేడుమల్లి ప్రాంతాలకు ప ట్టుకెళ్లి ఎన్‌కౌంటర్ నాటకం ఆడారని వారు ఆరోపిం చారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పని తిరుపతి మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. మారుడుమిల్లి ఎన్‌కౌంటర్ బూటకమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖండించారు.