కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ టీం ఇండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ గాయంతో విలవిలలాడిన గిల్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ స్థానంలో రిషబ్ పంత్ కెప్టెన్‌ా వ్యవహరించాడు. అయితే గిల్‌కి పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోతే.. రెండో టెస్ట్‌కి కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉంది.
దీంతో గిల్ రెండో టెస్ట్‌లో పాల్గొన పోతే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కి జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. ఇప్పటికే ప్రకటించిన జట్టును ప్రకటించారు కాబట్టి.. రుతురాజ్‌ను ఎలా తీసుకుంటారనే ప్రశ్న వస్తుంది. ‘‘సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ రిజర్వ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు. ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరిని తీసుకున్న మొత్తం ఏడుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవుతారు. ఇది సమంజసం కాదు’’ అని ఆకాశ్ పేర్కొన్నారు.
అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కుడి చేతి వాటం బ్యాటర్లు అయినప్పటికీ.. ఆకాశ్ మాత్రం రుతురాజ్‌కే మద్దతు ఇస్తున్నారు. ‘రుతురాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్ ఏ తరఫున వన్డేల్లో పరుగులు రాబడుతున్నాడు. అతడికి రెడ్ బాల్ క్రికెట్‌లో అవకాశం దక్కడం లేదు. రుతురాజ్.. రంజీ దులీప్ ట్రోఫీలో చక్కగా రాణించాడు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.