తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించడానికి, మీ-సేవకు సంబంధించిన అన్ని సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే అందించనుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ఉదయం 11.30 గంటలకు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారు. మీ-సేవ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ అన్నీ వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందితే ఆ సర్టిఫికెట్‌ను సైతం వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రజలకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించడానికి ఉద్దేశించిన ఈ అధునాతన సేవలను ప్రభుత్వం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించనుంది.