తిరుమల: తిరుమల శ్రీవారిని నటుడు సాయిదుర్గా తేజ్ దర్శించుకున్నారు. మంచి చిత్రాలు. సంతోషమైన జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమలకు వచ్చానని సాయి తేజ్ తెలిపారు. కొత్త సంవత్సరంలో శ్రీవారి ఆశీస్సులు కావాలని దర్శించుకున్నానన్నారు. పెళ్లిపై వార్తలు వస్తున్నాయని విలేఖర్లు సాయిని అడిగారు. వచ్చే సంవత్సరం తాను పెళ్లి చేసుకుంటానని వివరణ ఇచ్చాడు. వచ్చే సంవత్సరం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా విడుదలవుతుందని, ప్రేక్షకులు ఆదరించాలని తేజ్ కోరారు. ఈ సినిమాలో నటుడు సాయి తేజకు తోడుగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ సినిమాను కెపి రోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు.