‘పేరు ప్రతిష్ట అనేది మరో విధమైన ఒంటరితనమే’ అన్నారు కిరణ్ దేశాయ్. బుకర్ అవార్డుకు షార్ట్ లిస్టు అయిన నవల ‘ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ గురించి మాట్లాడుతూ ఆమె ఈ మాటన్నారు. మనిషికి పేరు, గౌరవం, ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చినప్పటికీ, దాని వెనుక లోతైన ఒంటరితనం మిగిలే ఉంటుంది. ఎందుకంటే ఆ పేరు ప్రఖ్యాతి ఆ మనిషిని ప్రపంచం నుండి వేరుచేస్తుంది అందరూ చూస్తారు, మెచ్చుకుంటా రు. కానీ, నిజమైన అనుబంధం, సన్నిహితత్వం క్రమంగా దూరమవుతాయి. ఇది నా కచ్ఛితమయిన అభిప్రాయం అన్నారు కిరణ్ దేశాయ్. దాదాపు రెండు దశాబ్దాల క్రితం The Inheritance of Loss నవలతో బుకర్ బహుమతిని అందుకున్న కిరణ్ దేశాయి ఇప్పుడు మళ్ళీ వలసానంతర భారతదేశ జీవితాల నేపథ్యంలో, ఐడెంటిటీ గందరగోళాన్ని చూపిన ఒక సున్నితమైన నవల రాసారు. ఆ కొత్త నవల The Loneliness of Sonia and Sunny. ఈ నవలలో కిరణ్ దేశాయ్ ప్రధానంగా మనుషుల మధ్య ఉన్న దూరాన్ని, వలస జీవితపు భారాన్ని, ఒంటరితనం ఇచ్చే స్వచ్ఛమైన ఆత్మ నిశ్శబ్దాన్ని ఆవిష్కరించింది దీనిలో.
ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ ఈ నవల ఆలోచన నాకు ఆధునిక కాలపు ఒంటరితనంతో మొదలైంది” అంది. అంతేకాదు పాతకాలపు సౌందర్యం కలిగిన ఆధునిక ప్రేమ కథ ను రాయాలని అనుకుని రాసాను అన్నారు. నేటి ప్రేమకథలోనూ నాటి పాతకాలపు మాధుర్యాన్ని నింపాలని కలగన్నాను. అదే చేసాను అన్నారామె. నిజానికి నా తల్లిదండ్రుల కాలంలో, ముఖ్యంగా నా తాతమ్మల కాలంలో, భారతీయ ప్రేమకథ ఒకే సమాజం, ఒకే వర్గం, ఒకే మతం, తరచూ ఒకే ప్రదేశంలో పాతుకుపోయి అట్లా నిలబడి పోయి ఉండేది. కానీ నేటి గ్లోబలైజ్‌డ్ ప్రపంచంలో ఒక ప్రేమకథ గమనం ఎన్నో దిక్కులు ఎన్నో వైపులు మలుపు లు తిరుగుతుంది. అందుకే ‘ద లోన్‌లి నెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’లో నా పాత్రలు తాము తాముగానే ఆలోచిస్తాయి. అంతెందుకు ప్రేమకు ఈ వ్యక్తే ఎందుకు? ఇంకెవరైనా ఎందుకు కాకూడదు? ఇక్కడే ఎందుకు? అక్కడ ఎందుకు కాదు? అని కూడా ఆలోచిస్తాయి. నిజానికి పూర్వకాలంలో మనుషు లు తాము తమకు అనుకూలమయిన ఉండవలసిన చోటే ఉండేవారు. కానీ ఈ నవలలో పాత్రలు
సోనియా సన్నీ, యూరప్, ఇండియా, అమెరికా అంతటా కలుసుకుని విడిపోతారు. వారికి తమపై ఉన్న భావన మరింత సరళంగా మారుతూ ఉంటుంది. అందుకే ఇది కేవలం కిరణ్ దేశాయి రాసిన సోనియా మరియు సన్నీ ప్రేమకథ మాత్రమే కాదు.. వలస భారతీయుల మానసిక స్థితిని, దూరంలో ఉండి కూడా దగ్గరగా ఉండాలనే తపన’ను ప్రతిబింబించే కథగా మనకు అర్థమవుతుం ది. కిరణ్ దేశాయ్ 1971 సె ప్టెంబర్ 3వ తేదీ, శుక్రవారం, చండీఘడ్‌లో జన్మించారు. ఆమె తల్లి ప్రసిద్ధ రచయిత్రి అనిత దేశాయ్, తండ్రి అశుతోష్ దేశాయ్. కిరణ్ గొప్ప సాహిత్యాభిమాన వాతావర ణం ఉన్న కుటుంబంలో పు ట్టారు. చిన్నప్పటినుంచే పుస్తకాల వాతావరణంలో పెరిగిన ఆమెకు సాహిత్యంతో స్నే హం సహజంగానే అబ్బింది.
కిరణ్ దేశాయ్‌కి సాహిత్య వారసత్వం తల్లిదండ్రులిద్దరిదీ అయినప్పటికీ ఆమెకు సాహిత్యంలో ఉన్న సున్నితమైన భావాలు, మంద్ర స్వరాలు, పదాల నిశ్శబ్ద సంగీతం ఇలా అన్నీ ఆ తండ్రి నుంచి సంక్రమించినవే. ఇక తల్లి అనితా దేశాయి జర్మన్ మూలాలు కలిగిన భారతీయురాలు. ప్రముఖ నవలా రచయిత్రి. కిరణ్‌కు సాహిత్యం కేవలం వృత్తికాదు అది కుటుంబ పరంపరలో ప్రవహించే నదిలాంటిది. తండ్రి బెంగాలీ. ఈ రెండు సంస్కృతుల మేళవింపే కిరణ్‌లో కనిపించే మానవతా దృష్టి. ఆమె తొలుత రాసిన రెండు ప్రధాన నవలలు Hullabaloo in the Guava Orchard మరియు The Inheritance of Loss ఇవి రెండూ వలసానంతర ప్రపంచం లో వ్యక్తిగత మరియు సమూహిక గుర్తింపుల్లోని సంక్లిష్టతలను అర్థం చేసుకునే రచనలుగా గుర్తింపును అందుకున్నాయి.
‘గువ్వపండు చెట్టుపైన గోలగోల’ (Hullabaloo in the Guava Orchard)లో సమ్పత్ చావ్లా అనే పాత్ర, సమాజపు అంచనాలు, కుటుంబ ఒత్తిళ్ల మధ్య తన స్వీయ గుర్తింపును వెతుక్కుంటూ గువ్వపండు చెట్టుపైకి ఎక్కుతుంది. అది కేవలం తనకున్న సామాజిక వ్యతిరేకత కాదు, అంతర్గత మనోవలస కూడా. ఆ చెట్టు అతనికి మొదట కుటుంబం నుండి తప్పించుకునే ఆశ్ర యం అవుతుంది. కానీ కాలక్రమేణా అదే స్థలం అతని కొత్త గుర్తింపు కేంద్రం గా మారుతుంది. అతను తనకు తెలియకుండానే సమాజం అతనిపై ప్రతిఫలించిన దృష్టికోణాల వల్ల పుణ్యాత్ముడుగా మలచబడతాడు. ఈ నవల వలసానంతర భారత సమాజంలో కుటుంబం, సమాజం, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఉన్న ఘర్షణలను వ్యంగ్యంగానూ సానుభూతితోనూ విశ్లేషిస్తుంది.
ఇక తర్వాతి నవల ‘వలస వారసత్వం, విచ్ఛిన్నమైన జీ వనాలు’ ఇందులో ప్రధాన పాత్రసాయి, భారతీయ బ్రి టీష్ సంస్కృతుల మిశ్ర మ వారసత్వంలో పుట్టిన యువ తి. ఆమె తాత ఒక మాజీ వలసాధికారిగా, స్వాతంత్య్రానంతర భారత వాస్తవాలను అం గీకరించలేక, రెండు ప్రపంచాల మధ్య తటస్థంగా నిలబడతాడు. అతని మనస్తత్వం, వ్యక్తిగత, సామాజిక గుర్తింపు రెంటి నడుమ సం ఘర్షణగా ఉంటుంది. సాయి జీవితంలో జ్ఞాన్ అనే గోర్ఖా యువకుడు ప్రవేశించడంతో ఆమె ఆత్మగత ప్రపంచం మరింత సంక్లిష్టమవుతుంది. ప్రేమ, జాతి, రాజకీయ చైతన్యం ఇవన్నీ కలిపి ఆమె స్వీయ గుర్తింపును ప్రశ్నించే స్థితికి నెడతాయి. దేశాయ్ రాసిన ఈ రెండు నవలలూ ఆధునిక ప్రపంచీకరణ, వ్యక్తి, సమాజపు గుర్తింపుపై చూపే ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. సంప్రదాయం, ఆధునికత, స్థానికత, గ్లోబల్ విలువల మధ్య సాగే ఈ సంఘర్షణ ఆ పాత్రల జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంది. మొత్తం మీద కిరణ్ నవలలు మానవ వలస అనేది కేవలం భౌగోళిక ప్రయాణం మాత్రమే కాదు.. అది ఆత్మ సంస్కృతి, గుర్తింపుల పునరావిష్కరణ అని చెప్పకనే చెబుతాయి. మనం గర్వించదగ్గ రచయిత్రి కిరణ్ దేశాయి.
– వారాల ఆనంద్