అక్షరాలు రాని అక్షర సాధుడవు
లక్ష్యాన్ని గురి తప్పని యోధుడవు
పాటకే ప్రణమిల్లి పయనించినోడా
లోకాన్ని చుట్టిన లోక సంచారుడా
తెలుగు నేలపైన నీపాట కేతనం
వర్ధిల్లు నీపాట కళకళా కాంతులా
అందెశ్రీ అన్నకు అరుణాంజలి
మా ఆట పాట నీకు
పుష్పాంజలి అక్షరాలు
గొర్ల కాపరికాడా, బర్ల కాపరికాడ
గాలిపాట జానపద జీవనాడి అయినోడా
చదువు రాదని నీకు శషబిషలు లేవులే
పామరులు, పండితులు నీముందు బెదురులే
ఆశువుగా నీ పాట శెలిమలా ఊరు
మనిషి తనువును తడిపి
ఏరులా మారు అక్షరాలు
మాయమైపోతున్న మనిషని చెప్పావు
కొమ్మనే ఈ భూమి ఆది అమ్మాన్నావు
తెలంగాణ తలరాత మార్చిన గీతవై
కోట్ల జనముకు పాట గళమిచ్చి పోతివి
నీ పాట పవనమై ఈ నేల వీచును
మా ఆశ, శ్వాసల మాలోనే కాసును అక్షరాలు
తెలంగాణ మట్టి సారాన్ని చదివినవ్
బతుకు చిత్రాల బలమైన పాటవు
నువ్ రాసిన పాటలు మేం చదివే పాఠాలు
బోధకుడా చోదకుడా తెలంగాణ సాధకుడా
తెలంగాణ మట్టిలో నీపాటే పరిమళం
ఎంత తిన్నా అది అమృత భాండవం అక్షరాలు
నీ పాటల్లో ఉన్నది ధిక్కార స్వరము
నీ నడకల్లో ఉన్నది భాస్వర వరము
మాటంటే పడకుండా ధైర్యంగా నిలిచావు
బతికితే కవిలాగా నీలాగ బతకాలి
దిక్కులేని చావు అయితదని తలిచావు
దిక్కులే నిన్ను చూసి
మొక్కుతున్నయి చూడు అక్షరాలు
– యశ్ పాల్ (కవి, రచయిత)