ట్రాన్స్‌జెండర్ల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ పుట్టిన రోజు వేడుకల్లో రెండు ట్రాన్స్‌జెండర్ల గ్రూపులు కలిశాయి. ఈ సమయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడంతో తిట్టుకోవడమే కాకుండా దాడులు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం వారి లీడర్ మోనాలిసా వద్దకు చేరింది. ఓ గ్రూపునకు చెందిన వారిని మోనాలిసా దూషించిందని మిగతా వారు ఆరోపించారు. మోనాలిసాకు వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్లు బోరబండ బస్‌స్టాప్ వద్ద ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారిని అడ్డుకోవడంతో ట్రాన్స్‌జెండర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హంగామా చేశారు. మోనాలిసాపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ట్రాన్స్‌జెండర్లు ఆరోపించారు.