రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్‌ఎల్ ఎల్ పి బ్యానర్‌పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఆదివారం మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ ట్రైలర్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘చాలా మంచి ఎంటర్‌టైనర్ ఇది. మా ప్రొడ్యూసర్ మాధవి చాలా పాషన్‌తో తీశారు. డైరెక్టర్ రామ్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. అద్భుతమైన డైరెక్టర్ అవుతాడు. శేఖర్ చంద్రతో ఇది నాకు నాలుగో సినిమా. ఫ్యామిలీ అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను‘అని అన్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘రాజ్ తరుణ్ కుమా రి 21ఎఫ్ అం టే నాకు చాలా ఇష్టం. ఆయన కం బ్యాక్ కోసం ఎదురుచూచూస్తు న్న శ్రేయోభిలాషుల్లో నేను ఒకడిని. ఈ సినిమా తో హిట్ కొట్టి మళ్ళీ ఒక లవ్‌స్టోరీతో గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. డైరెక్టర్ రామ్ మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకునే క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాశీ సింగ్, మాధవి, వివేక్ కూచి బొట్ల తదితరులు పాల్గొన్నారు.