బీహార్‌లో కేబినెట్ కూర్పుపై ఎన్‌డిఏ ఫార్ములా
బిజెపికి 15 నుంచి 16, జెడియుకు 14 మంత్రి పదవులు
ఎల్‌జెపికి 3, మిగతా పక్షాలకు ఒక్కొక్కటి చొప్పున పదవులు
నేడు జెడియు శాసనసభాపక్ష సమావేశం
19 లేదా 20న ప్రమాణస్వీకార కార్యక్రమం
పాట్నా: బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు రం గం సిద్ధమైంది. ఎన్డీఏ కొత్త కేబినెట్ ఎలా ఉండాలన్న అంశంపై స్పష్టమైన అవగాహన కుదిరింది. భాగస్వామ్య పార్టీల మధ్య శాఖల పంపిణీకి సంబంధించిన ఫార్ములా రెడీ అయింది. ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పద వి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఇక కొత్త కేబినె ట్ ప్రమాణ స్వీకారం తేదీ ప్రకటించడమే తరువాయి. ఢి ల్లీలో బీజేపీ కేంద్ర నాయకులతో సంప్రదింపులు జరిపిన జేడి(యు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా పాట్నా చేరారు. జెడిశ్(యు) ఎన్డీఏ సం యుక్త శాసనసభాపక్ష సమావేశాల ఏర్పాటుపై సీఎం ని తిశ్ కుమార్‌తో చర్చిస్తారు. జెడి(యు) సభాపక్షం సమావేశం నేడు (సోమవారం) జరగువచ్చు.
ఎన్డీఏ తదుపరి నాయకుడి ఎంపిక ప్రక్రియ నవంబర్ 18 నాటికి పూర్తవుతుంది. మరో పక్క హెచ్‌ఎఎమ్ చీఫ్, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కేంద్రహోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ బీజేపీ నాయకులతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చారు. అలాగే ఉపేంద్ర కుష్వాహా, ఆర్‌ఎల్ జేడి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కూడా ఢిల్లీలో అమిత్ షాతో చర్చించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ సోమవారం నాడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, కేబినెట్ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించేముందు, ప్రస్తుత అసెంబ్లీ రద్దును ఆమోదిస్తారు. దీంతో కొత్త అ సెంబ్లీ ఏర్పాటుకు మార్గం సులభమవుతుంది.
18వ బీహా ర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు ఆదివారం నాడు నేడు సమర్పించింది. బహుశా సోమవారం కొత్త అసెంబ్లీకి నోటిఫై చేస్తారు. నేటితో ఎన్నికల కోడ్ కూడా ముగుస్తుంది. నవంబర్19, లేదా 20న కొత్త కేబినెట్ మంత్రుల ప్ర మాణస్వీకార కార్యక్రమం నిర్వహణకు పాట్నా గాంధీ మైదా న్‌లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రధాని షెడ్యూ ల్‌పై ప్రమాణ స్వీకారం ఆధారపడిఉంది.
సీనియర్ బీజే పీ ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. బీహార్ అసెంబ్లి ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది. బీజేపీ 89 స్థానాలు సాధించి అసెంబ్లిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 85 స్థానాలతో జెడి (యు) రెండోస్థానంలో ఉంది. ఆర్‌ఎల్ జెపి 19, హెచ్‌ఎ ఎం5 రాష్ట్రీయలోక్ మోర్చా4 స్థానాలు గెలుచుకున్నా యి. మహాఘట్బంధన్ ఈ సారి 35 స్థానాలకే పరిమితమైంది.