జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం నాడు శ్రీనగర్ లో జాసిర్ బిలాల్ వాని అనే కుట్రదారుడిని అరెస్ట్ చేసిందని అధికారులు తెలిపారు. గతవారం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ ఉన్ నబీకి జాసిర్ బిలాల్ వాని… క్రియాశీల సహ కుట్రదారుడుగా అధికారులు పేర్కొన్నారు.వాని జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఖాజీ గుండ్ నివాసి. అతడినికి డానిష్ అనే మారుపేరు కూడా ఉంది. నవంబర్ 10న కారు బాంబు పేలుడుకు ముందు డ్రోన్ లను సవరించడం, రాకెట్లను తయారు చేయడానికి ప్రయత్నించడం ద్వారా టెర్రరిస్ట్ దాడులు చేయడానికి సాంకేతిక సహాయం అందించాడని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన వాని వెనుక చురుకైన కుట్రదారుడు, దాడి ప్లాన్ చేయడానికి ఉమర్ ఉన్ నబీతో కలిసి పనిచేశాడని ఆ ప్రకటనలో తెలిపారు.
నవంబర్ 10న దేశ రాజధానిలో జరిగిన పేలుడు వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి ఏజెన్సీ వివిధ కోణాలను అన్వేషిస్తోంది. దాడిలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించడానికి రాష్ట్రాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.జాసిర్ బిలాల్ వాని పొలిటికల్ సైన్స్ చదివాడు. అతడిని ఉమర్ చేరదీసి కొన్నేళ్లపాటు ఆత్మాహుతి బాంబర్ గా మార్చే విధంగా తీవ్రంగా బ్రెయిన్ వాష్ చేశాడు. గత సంవత్సరం అక్టోబర్ లో కుల్గామ్ లోని ఒక మసీదులో డాక్యర్ మాడ్యూల్ ను కలవడానికి వాని అంగీకరించాడు. ఆ తర్వాత ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అద్దె ఇంట్లో చేరాడు.జమ్మూకశ్మీర్ పోలీసులు వానిని మొదట అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా మాడ్యూల్ లోని ఇతరులు తనను జేష్ -ఎ- మొహమ్మద్ లో ఉండాలని కోరినా, ఉమర్ తనను ఆత్మాహుతి బాంబర్ గా తయారయ్యేలా బ్రెయిన్ వాష్ చేశాడని పేర్కొన్నాడు.